ప్రభాస్ (Prabhas) అలాగే కృతి సనన్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adipurush). ఈ సినిమా నుండి ఎప్పుడు అప్డేట్స్ వస్తాయా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ సినిమాని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేశారు. ఇప్పుడు మేకర్స్ ఆదిపురుష్ ట్రైలర్ (Adipurush Trailer Release Date) విడుదల తేదీ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ప్రభాస్ విడుదలకు సిద్ధమైన కొత్త సినిమా ఆదిపురుష్ (Adipurush). ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ టీజర్ అలాగే సాంగ్స్ ని విడుదల చేశారు మేకర్స్. మొదట సినిమాపై నెగటివ్ ప్రచారం జరగగా ఆ తర్వాత విడుదలైన అప్డేట్స్ వల్ల సినిమాపై పాజిటివ్ బజ్ వచ్చింది. ప్రస్తుతం అందరూ ఆదిపురుష్ ట్రైలర్ (Adipurush Trailer) ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ సినిమాపై బాగానే కాన్సన్ట్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తను చేయబోయే సినిమాల అప్డేట్స్ ఇవ్వద్దంటూ మేకర్స్ కూడా రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.
లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు ఆదిపురుష్ ట్రైలర్ ని (Adipurush Trailer) మే 9న విడుదల చేయుటకు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే మేకర్స్ చేయబోతున్నట్టు చెబుతున్నారు. ఓం రౌత్(om raut) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా లో సీత పాత్ర చేస్తున్న కృతి సనన్ (Sita Devi)కి సంబంధించిన పోస్టర్ని విడుదల చేయడంతో మరింత హైప్ పెరిగింది ఈ సినిమాపై.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) రాముడి పాత్రలో.. హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్(saif ali khan), సన్నీ సింగ్ ముఖ్యమైన పాత్రలలో చేస్తున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆది పురుష సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.