ఆదిపురుష్‌ సీత పాత్ర‌లో మ‌హేశ్ హీరోయిన్ ఫైన‌ల్‌..!

0
377
Prabhas adipurush update kriti sanon to play female lead here are the details

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-ఓం రావ‌త్ కాంబోలో తెర‌కెక్కుతున్న ప్రాజెక్టు ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా న‌టిస్తున్నాడు. ప్ర‌భాస్ ఈ చిత్రంలో రాముడిగా క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ షూట్ ప్రారంభానికి ముందే సంచనాలు సృష్టిస్తోంది. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు సంప్రదించారని కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఈ సినిమాలో సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంపై ఇప్ప‌టికే చాలా వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. కొన్నాళ్లు కీర్తి సురేష్ నటిస్తుందని టాక్ నడిచింది. ఆ తర్వాత అనుష్కా శెట్టి, అనుష్క‌శ‌ర్మ‌, కైరా అద్వానీ ఇలా టాప్ హీరోయిన్ల పేరు వినిపించాయి. తాజాగా వ‌న్ నేనొక్క‌డినే ఫేం కృతిస‌న‌న్ పేరు ఖ‌రారైన‌ట్టు బీటౌన్ వ‌ర్గాల స‌మాచారం. అయితే దీనిపై ప్ర‌భాస్ టీం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఈ యాక్షన్ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా 2021 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్తుందని భావిస్తున్నారు. ఈ ఎపిక్ ప్రాజెక్ట్‌లో విస్తృత శ్రేణి 3డి గ్రాఫిక్స్‌ను వాడనున్నారు. లాంగ్ షెడ్యూల్ లో షూటింగ్ కొన‌సాగించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. స్టార్ వార్స్‌, అవ‌తార్ వంటి సినిమాల‌కు ప‌నిచేసి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వీఎఫ్ఎక్స్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సినిమా షూటింగ్ ను పూర్తిచేసేందుకు ఓం రావ‌త్‌, భూష‌ణ్ ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా తీయనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here