Siddharth Anand – Prabhas Movie: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నాలుగు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా తను ఇంకా ఒక మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులు అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. వాటిలో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ వారిది. బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) అలాగే ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో ఒక సినిమాని మైత్రి మూవీ వారు ఫిక్స్ చేయడం జరిగింది.
Siddharth Anand – Prabhas Movie: డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) గత ఏడాది షారుఖాన్ పటాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ను అనుకున్న సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ వారు అడ్వాన్స్ కూడా 70 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ సిద్దార్థ్ ఆనంద్ తన దర్శకత్వంలో వస్తున్న ఫైటర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని 2024లో విడుదల చేయుటకు దర్శకుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంట. అలాగే దీనితోపాటు టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా స్క్రిప్ట్ కూడా ఇంకా సంవత్సరం పైనే సమయం పట్టేటట్టు ఉందంట.
టైగర్ వర్సెస్ పఠాన్ సినిమా 24లో మొదలు పెడితే ఆ పై వచ్చే సంవత్సరానికి గాని స్క్రిప్ట్ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న వార్ 2 సినిమాను కూడా అయాన్ ముఖర్జీకి ఇచ్చేసారని తెలుస్తుంది, ఇక ప్రభాస్ (Prabhas) సినిమా మొదలుపెట్టడానికి రెండు సంవత్సరాలు పైనే సమయం పట్టి అవకాశం ఉంది. అందుకనే దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) తీసుకున్న అడ్వాన్స్ 70 కోట్లు మైత్రి మూవీ మేకర్స్ వారికి భవిష్యత్తులో సినిమా చేద్దాం అంటూ ఒక మాట అనుకొని తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం.
అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం పుష్ప 2 అలాగే ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ కూడా రెడీ అవుతున్నారు… వీటితోపాటు రీసెంట్ గా జరిగిన ఐటీ రైట్స్ వల్ల విపరీత మైన ఒత్తిడి లో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా సానుకూలంగా దర్శకుడు చెప్పినదానికి సరే అని అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ప్రభాస్ ఒక క్రేజీ మూవీ మిస్ అయినట్టే. ఈ క్రేజీ కాంబినేషన్ భవిష్యత్తులో మళ్లీ సెట్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.
Web Title: Prabhas and director Siddharth Anand movie cancelled, Director Siddharth Anand has reportedly refunded Rs 70 crore fee to Mythri Production. Siddharth Anand new movie with Prabhas