Prabhas no to Bollywood directors: రామాయణం నుండి ప్రేరణ ఉంది తెరకెక్కించిన సినిమా ఆది పురుషు, ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడం జరిగింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు అలాగే కలెక్షన్స్ పరంగా కూడా యావరేజ్ అని టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇంత దారుణమైన ఫలితాన్ని ఎదుర్కోవడంతో, కొంతకాలం పాటు బాలీవుడ్ దర్శకులతో పని చేయకూడదని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Prabhas no to Bollywood directors: లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ఒప్పుకున్న సినిమాను కూడా ఓల్డ్ చేసినట్టు తెలుస్తుంది. పఠాన్ దర్శకుడు తో చేయబోయే హృతిక్ రోషన్ అలాగే ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ కూడా ప్రస్తుతానికి ఆపేసినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌కి ఈ సినిమా ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ కావాల్సి ఉంది. పఠాన్ ఘనవిజయం సాధించినందుకు అభినందించేందుకు నిర్మాత దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌ను కలిశారు.
సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రభాస్ మరియు హృతిక్ రోషన్ మల్టీస్టారర్‌లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇందులో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుని షూటింగ్లోకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారు కానీ అనుకోని విధంగా ప్రభాస్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

సిద్ధార్థ్ ఆనంద్ గతంలో హృతిక్ రోషన్‌కి దర్శకత్వం వహించిన బ్యాంగ్ బ్యాంగ్ మరియు వార్ రెండూ బ్లాక్ బస్టర్స్. ప్రభాస్ మరియు హృతిక్ రోషన్ మల్టీస్టారర్ సాకారమై ఉంటే అది భారతీయ సినిమా అతిపెద్దదిగా ఉండేది కానీ ఆదిపురుష్ రిజల్ట్ చూసిన తర్వాత ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులకు నో చెబుతున్నాడు.