Prabhas and Nayanthara will be seen as Lord Shiva and Maa Parvati in Kannappa, Prabhas In Kannappa movie, Nayanthara role in Kannappa movie, Manchu Vishnu Kannappa movie shooting update, BTS images.
మంచు విష్ణు రీసెంట్గా కన్నప్ప అనే చారిత్రాత్మక సినిమాని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కన్నప్ప సినిమాని దాదాపు 100 కోట్ల పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా కీలకమైన పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితం శ్రీశైలంలో జరపక.. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) అలాగే నాయనతార (Nayanthara) కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం అందుతుంది.
కన్నప్ప (Kannappa Movie) సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన షూటింగ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. ఇక విషయానికి వస్తే ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో చేస్తున్నట్టు విష్ణు సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. అలాగే ఈరోజు నయనతార కూడా ఈ సినిమాలో ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే అందుతున్న సమాచారం మేరకు నయనతార ఈ సినిమాలో పార్వతి పాత్రలో చేస్తుందంట. 16 సంవత్సరాల తర్వాత ప్రభాస్ అలాగే నయనతార మళ్ళీ కన్నప్ప సినిమాలో కలిసి నటించడం విశేషం. ఈ సినిమాలో శివపార్వతిగా ప్రభాస్ అలాగే నయనతార కనిపించబోతున్నారు. అయితే కన్నప్ప సినిమాకు సంబంధించిన హీరోయిన్ గా నూరు సనం మొదటిగా తీసుకోగా ఆ తర్వాత తన డేట్స్ సినిమాకి అనుకూలంగా లేవు అంటూ తను తప్పుకోవడం జరిగింది .

మంచు విష్ణు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే ఇప్పుడు హీరోయిన్ కోసం ఇంకా ఎవరిని ఫిక్స్ చేయలేదు అంటూ సమాచారమైతే అందుతుంది. ప్రభాస్ అలాగే నయనతార ఈ సినిమాలో నటించడం వల్ల పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.