పూజా డెసిషన్ కి షాక్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ

0
372
Prabhas and Pooja Hegde Radhe Shyam shooting Update

సౌత్ ఇండస్ట్రీలో నటిస్తున్న చాలా మంది హీరోయిన్ల బాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువగా రాగానే వారి ప్రయారిటీ మారిపోతుంది. తమను నిలబెట్టిన సౌత్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి బాలీవుడ్ ఆఫర్లకు గ్రీన్ సిగ్నలిస్తారు. కేవలం కొద్ది మంది మాత్రమే బాలీవుడ్లో గుర్తింపు లభించినా తమను నిలబెట్టిన సౌత్ ఇండస్ట్రీని గుర్తుంచుకుని ఇక్కడ కూడా సినిమాలు చేస్తారు. అటువంటి వారిలో పూజా హెగ్డే కూడా ఒకరని చెప్పుకోవాలి.

బాలీవుడ్లో పూజకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ వరుస ఆఫర్లు పూజను వరిస్తున్నాయి. అలాగే సౌత్ ఇండస్ట్రీ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండటాన్ని పూజా అదృష్టంగా భావిస్తోంది. రీసెంట్ గా పూజా డెసిషన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. పూజకు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ అలాగే రోహిత్ శెట్టి “సర్కస్”లో లీడింగ్ లేడీగా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా మేకర్స్ ను పూజా రిక్వస్ట్ చేసిందట. కానీ తెలుగు మూవీకి కాల్ షీట్స్ ను అలాట్ చేయడం కోసం బాలీవుడ్ మూవీ షూటింగ్ ను క్యాన్సిల్ కూడా చేసుకుంది.

ప్రస్తుతం, పూజా హెగ్డే ప్రభాస్ సరసన “రాధే శ్యామ్”లో నటిస్తోంది. ఈ సినిమా ఇపుడు షూటింగ్ చివరి దశలో వుంది.. ప్రభాస్ సినిమా కొన్ని కీలక సన్నివేశాలు షూటింగ్ చేయాల్సి ఉండగా దానిలో పూజ షూట్ కూడా వుంది అంట అలాగే బాలీవుడ్ షూటింగ్ లో బిజీగ వున్నా డైరెక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి మరి “రాధే శ్యామ్” మూవీకి డేట్స్ అలాట్ చేసింది అని ఫిలిం నగర్లో టాక్.. మొత్తానికి, పూజా టాలీవుడ్ కి ఇస్తున్న ఇంపార్టెన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Previous articleఆషిక రంగనాథ్ పిక్స్
Next articleఎ.ఆర్. రెహమాన్ తల్లి కరీమా బేగమ్ కన్నుమూత