Prabhas : ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ అనే ప్రేమకథాచిత్రం పూర్తిచేసి సలార్ అనే మాస్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ‘సలార్’ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. అందులోని ఓ పాత్రలో ఆర్మీ అధికారిగా కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
నిజానికి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలిసినప్పటి నుండే సినిమా పై అంచనాలు భారీ లెవెల్లో సెట్ అయ్యాయి. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుండగా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో డార్లింగ్.. ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారట. మరొక పాత్ర ఏమిటనేది స్పష్టత లేదు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కించే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా ఉండనున్నాయట..
Also Read: Yash KGF Chapter 2 New Release Date Locked
మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమాను ఓంరౌత్ తెరకెక్కిస్తున్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణకు తాత్కాలికంగా వాయిదా పడింది.
Also Read: Actor Sunil Powerful Role In SSMB28 Film..?