Prabhas Remuneration: తాజా వార్తల ప్రకారం, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. 41 ఏళ్ల నటుడు కొన్ని పెద్ద ప్రాజెక్ట్ ప్రకటనలు మరియు కొన్ని పాన్-ఇండియా చిత్రాల లైనప్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ విడుదలకు సిద్ధం చేయగా, ప్రాజెక్ట్ కే, ఆది పురుష్ అలాగే సలార్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత ప్రభాస్ (Prabhas) రేంజ్ అమాంతం పెరిగింది. తాజా నివేదికల ప్రకారం, ప్రభాస్ ఇంకా కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లను ప్రకటించలేదు, ఎందుకంటే అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్ తను చేసే ప్రతి ఒక్క సినిమా కు కూడా 100 కోట్ల రూపాయల కి పైనే రెమ్యునరేషన్ (Remuneration) తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కానీ సందీప్ రెడ్డి వంగా Spirit సినిమా కోసం అతను 150 కోట్ల రూపాయలు కోట్ చేసాడు అని అలాగే ప్రభాస్ (Prabhas) కోట్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి మేకర్స్ అంగీకరించారు అని సమాచారం అందుతుంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్ మరియు ప్రాజెక్ట్ కే షూటింగ్ లలో బిజిగా ఉన్నారు. ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు.


అంతేకాకుండా, అతను ఇప్పుడు తన రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, యువి క్రియేషన్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్‌లను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన విడుదల కి సిద్దం అవుతోంది.