Pan India Star Prabhas: బాహుబలి ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్ని పంచుకుంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ (Prabhas) చేసిన సాహో సినిమా తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.
ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ప్రభాస్ (Prabhas), ఏకంగా రెండు వేల కోట్ల బడ్జెట్ తో నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే ప్రభాస్ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రాధేశ్యామ్ (Radhe Shyam) షూటింగ్ కంప్లీట్ చేసి జనవరి 14న రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు.
అలాగే Project K , Salaar, Spirit మరియు Adipurush సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇలా సినిమా రంగంలో ఆకాశమంతటి క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ తాజాగా మరొక ఘనతను సొంతం చేసుకున్నాడు.
యూకేకు చెందిన ప్రముఖ ‘ఈస్టర్న్ ఐ వీక్లీ’ వెబ్‌సైట్ 2021 కి సంబంధించి వెలువరించిన టాప్- 50 సౌత్ ఏషియన్ సెలబ్రిటీల జాబితాలో ప్రభాస్ అగ్రస్థానం కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్‌లో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన ఘనత ఇది అని చెప్పుకోవచ్చు.



మీడియాతో పాటు సోషల్ మీడియాపై కూడా అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 మంది సౌత్ ఏషియన్ ప్రముఖులను ఈస్టర్న్ ఐ వీక్లి ఎంపిక చేయగా.. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. కాగా, ఈస్టర్న్ ఐ వీక్లి సర్వేలో సాధించిన ఘనతతో సోషల్ మీడియాలో ప్రభాస్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Top 10 of 50 Asian Stars In The World List for 2021 (who inspiringly made a major impact)
1. #Prabhas
2. #RizAhmed
3. #PriyankaChopra
4. #MindyKaling
5. #ShreyaGhoshal
6. #KumailNanjiani
7. #SajalAli
8. #charlixcx
9. #DevPatel
10. #ShehnaazGill#AsjadNazirTop50AsianStars2021 pic.twitter.com/gH602vqLLF— Asjad Nazir (@asjadnazir) December 8, 2021