ప్రభాస్ వరుస బిగ్ బడ్జెట్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసింది. వీటిలో ఒకటైన ఆదిపురుష్ జూన్ 16న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ని మేకర్స్ ఇంతవరకు మొదలుపెట్టడం జరగలేదు. కొన్ని నెలల క్రితం ఆదిపురుష్ టీజర్ ని విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత సినిమాపై ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు.
నిజానికి ప్రభాస్ ఆది పురుష సినిమా గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా.. విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాలేదని సినిమాని జూన్ 16 కి వాయిదా వేయటం జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. విడుదల చేసిన ఆదిపురుష్ టీజర్ విఎఫ్ఎక్స్ బాలేదు అంటూ చాలా ట్రోల్స్ కి గురైంది. దీనితో మేకర్స్ మళ్లీ అదనపు బడ్జెట్ కేటాయించి ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ లో ఉన్నట్టు సమాచారం.
అయితే విడుదల తేదీ ఇంకా మూడు నెలలు ఉండేటప్పటికీ.. ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు మేకర్స్ దీంతో నిరాశ చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ నీ సోషల్ మీడియాలో ప్రోల్ చేస్తున్నారు. అలాగే (#StartAdipurushPromotions) అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు ట్రెండ్ లోకి వచ్చింది. ఈ ట్రైనింగ్ ట్యాగ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ప్రభాస్ సినిమా అయినా ఆదిపురుష్ సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టాలి అంటూ ఒకపక్క రిక్వెస్ట్ చేస్తూనే మరోపక్క ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఇప్పటికైనా రౌత్ మేల్కొని అప్‌డేట్లు ఇస్తారా? ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా? లేదా ? మళ్లీ వాయిదా వేస్తారా? అనేది చూడాలి.
Good Morning Darling's #Prabhas ❤️
Wake Up OM RAUT#StartAdipurushPromotions 🏹 pic.twitter.com/NBgvmspVhS
— #Adipurush (@rebelismm999) March 20, 2023
Om Come To My Room"
Wake Up OM RAUT#StartAdipurushPromotions pic.twitter.com/5GDsQzBsZM
— Prabhas EMPIRE (@Prabhas_Empire) March 20, 2023
Prabhas fans demand Adipurush promotion start immediately.. Prabhas fans trolling director Om Raut, Adipurush Promotions, Adipurush latest news, Adipurush release date, Prabhas’ fans demand Adipurush makers to start promotions with ‘Wakeup Om Raut’ tag