Homeసినిమా వార్తలుప్రభాస్ మొగల్తూర్ కి ప్రయాణం..దాదాపు లక్ష మందికి భోజనాలు

ప్రభాస్ మొగల్తూర్ కి ప్రయాణం..దాదాపు లక్ష మందికి భోజనాలు

Prabhas – Krishnam Raju: ప్రభాస్ మొగల్తూరు కి వెళ్లక దాదాపు 12 సంవత్సరాలు దాటింది. అనుకోని కారణాలవల్ల టాలీవుడ్ హీరో అలాగే రాజకీయవేత్త కృష్ణం రాజు గారు మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో తన అంత్యక్రియలను ఘనంగా జరిపారు. ఇప్పుడు అదేవిధంగా రాజు గారి చిన్న కర్మ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కృష్ణం రాజు గారి సొంత ఊరు అయినా మొగల్తూరులో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్మ సందర్భంగా పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభాస్ బంధుమిత్రులు అందరూ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ విషయం తెలుసుకొని రాలేకపోయినా అందరూ ఇప్పుడు పెద్ద సంఖ్యలో కార్యక్రమం జరిగే చోటుకు చేరుకుంటున్నారు.

దాదాపు లక్ష మందికి భోజనాలు పెట్టడానికి ఏ‍ర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కృష్ణం రాజు గారి మరణం తెలుసుకొని రాలేకపోయినా కొంతమంది సినీ ప్రముఖులు అలాగే రాజకీయవేత్తలు శ్యామల దేవి గారిని కలిసి పలకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కర్ణాటక మంత్రి అయిన శ్రీరాములు కృష్ణం రాజు గారి ఇంటికి చేరుకొని తన సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభాస్ దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారట.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY