Prabhas jacqueline fernandez Saaho Bad Boy song review
Prabhas jacqueline fernandez Saaho Bad Boy song review

సాహో…ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిన ఈ సినిమాని నేషనల్ రేంజ్ లో గట్టిగా ప్రోమోట్ చెయ్యాలని,బాలీవుడ్ లో దీనికి డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాలని సాహో టీమ్ సాయశక్తులా ప్రయత్నిస్తుంది.అయితే అలా అనుకుని రిలీజ్ చేసిన ఫస్ట్ పాట కాస్త తేడా కొట్టెయ్యడంతో సెకండ్ సాంగ్ కి రూట్ మార్చారు.అయితే ఇప్పుడు ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ గా పరిగణిస్తున్న ఐటెం సాంగ్ తో సినిమా టీమ్ ఎఫర్ట్ ఎలా ఉంది అనేది మరోసారి బయటపడింది.

ఆ ఐటెం సాంగ్ కి ముందు చాలా మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.అయితే తెలుగు,హిందీ రెండు భాషల్లో గుర్తింపు ఉన్న హీరోయిన్ ని తీసుకుని ఆ సాంగ్ చేస్తారు అనుకున్నారు.కానీ తీరా చూస్తే ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో స్టార్ రేంజ్ ఉన్న,తెలుగువాళ్ళకు కనీసం ముఖపరిచయం కూడాలేని జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని తీసుకున్నారు.ఇక ఆ పాట ట్యూన్,లిరికల్ వేల్యూ ,చివరికి షూట్ చేసిన విధానం కూడా అంతా ఫుల్లీ బాలీవుడ్ కలరింగ్ అనే చెప్పాలి.కెవ్వు కేక,పక్కా లోకల్,జిగేలు రాణి లాంటి ఐటెం పాటలు మనదగ్గర దుమ్మురేవుతాయి.మరి ఇప్పుడు ఇంత క్లాస్ గా ఉన్న ఈ ఐటెం సాంగ్ ని తెలుగు ప్రేక్షకులు,ముఖ్యంగా డార్లింగ్ ఇష్టపడే మాస్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే ప్రశ్న చాలామందికి మైండ్ లో బ్లింక్ అవుతుంది.కానీ ఈ పాట కూడా ఎక్కేస్తుంది అనే కాన్ఫిడెన్స్ సినిమా యూనిట్లో ఉంది.