Homeసినిమా వార్తలుకల్కి 2898 AD భారీ బిజినెస్.. 600 కోట్లు పెట్టి.. 6000 కోట్లు సాధ్యమేనా..?

కల్కి 2898 AD భారీ బిజినెస్.. 600 కోట్లు పెట్టి.. 6000 కోట్లు సాధ్యమేనా..?

Prabhas Kalki 2898 AD Business report, Kalki 2898 AD box office prediction, Kalki 2898 AD shooting details, Kalki 2898 AD Release Date, Prabhas upcoming movies

Kalki 2898 AD Business: బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ మార్కెట్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వస్తున్న సినిమాలు భారీ బడ్జెట్ తో తరికెక్కిస్తున్నారు మేకర్స్. ప్రభాస్ తో మూవీ తీయటానికి డైరెక్టర్లే కాకుండా ప్రొడ్యూసర్లు కూడా వెనకాడటం లేదు. అలాగే తాను చేసుకుంటూ పోతున్న సినిమాలు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు సాధిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఆది పురుష సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Prabhas Kalki 2898 AD Business: కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన అంచనాలను అందలేకపోయింది. దీని తర్వాత సలార్ అనే సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సెప్టెంబర్ లో విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై భారీగానే అంచనాలను పెంచింది. ఆ సినిమా మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. అలాగే మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ సృష్టించటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

ఇక దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ గా వస్తున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమాని వైజయంతి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కల్కి సినిమాకి ప్రస్తుతానికి 600 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు మూవీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే మొదటిగా రిలీజ్ చేసిన వీడియోతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. కల్కి 2898 AD సినిమా టీజర్ తోనే హాలీవుడ్ ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు.

Prabhas Kalki 2898 AD Business report
Prabhas Kalki 2898 AD Business report

కల్కి 2898 AD బిజినెస్ విషయానికొస్తే.. లెక్కలు ఎలా ఉన్నప్పటికీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో దాదాపు 4000 దగ్గర నుండి 5000 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టడం జరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే కల్కి సినిమాలో భారీ బడ్జెట్ తో పాటు భారీ నటీనటులు కూడా ఉన్నారు. కమల్ హాసన్, అమితాబచ్చన్ వీళ్ళతోపాటు దీపిక అలాగే హాలీవుడ్.. మిగతా భాషలకు సంబంధించిన తారాగణం కూడా విడుదల చేసిన టీజర్ లో కనబడుతున్నారు.

దానితోపాటు దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ అలాగే స్టోరీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు.. వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే జనవరి 12న విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ ఆ తర్వాత విడుదల చేసిన టైటిల్ వీడియోలో రిలీజ్ డేట్ విషయం ప్రకటించలేదు. దీనితో ఈ సినిమా 2024 సంక్రాంతి నుంచి సమ్మర్ కి సినిమా వాయిదా పడుతుందని టాక్.

Prabhas Kalki 2898 AD Business report, Kalki 2898 AD box office prediction, Kalki 2898 AD shooting details, Kalki 2898 AD Release Date, Prabhas upcoming movies

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY