Prabhas Kalki 2898 AD Story Line Leaked: శుక్రవారం రోజు ప్రభాస్ మేకర్స్ ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ గా వస్తున్న సినిమాకి కల్కి 2898 AD అనే టైటిల్ ని మొదటి గ్లింప్స్ వీడియో తో విడుదల చేయడం జరిగింది. విజువల్ వండర్ గా తరిగెక్కుతున్న కల్కి 2898 AD సినిమా వీడియో విడుదలైన దగ్గర నుండి కల్కి స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో చాలావరకు ప్రచారాలు జరుగుతున్నాయి. మరి కొంతమంది అయితే కల్కి సినిమా ఏలియన్ కదా అని అంటున్నారు.
Kalki 2898 AD Story : ప్రాజెక్ట్ కే సినిమాకి కల్కి అనే పేరు ఎందుకు పెట్టారు..? కల్కి ఎవరు..? కల్కి సినిమా స్టోరీ ఏంటి..? ఇలా మందికి డౌట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్న ఈ సినిమాకి శుక్రవారం రోజు అమెరికాలో మొదటి గ్లింప్స్ తో టైటిల్ విడుదల చేయడం జరిగింది. వీడియో విడుదలైన తర్వాత అభిమానులు హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయంటూ సంబరాలు చేసుకున్నారు. ఇక ప్రభాస్ కల్కి సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మహా విష్ణువు అవతారమే కల్కి.
కల్కి సినిమా పూర్తిగా పురాణ నేపథ్యంలో కొనసాగే కదా. ఒక్కో యుగంలో ఒక అవతారమేత్తే విష్ణుమూర్తి నీ కల్కి అని పిలుస్తూ ఉంటారు. ప్రతి యుగంలో దుష్టశిక్షణ చేసి తిరిగి శాంతిని నెలకొల్పుతూ ఉంటారని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ అదే కథను తీసుకొని మోడ్రన్ హంగులతో తరికెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కల్కి భగవాన్‌ను పోలి ఉంటుందని సమాచారం.

కలియుగంలో ఒక దుష్ట శక్తి ప్రజలను తన ఆధీనంలోకి తీసుకొని బానిసలను చేసుకోవాలని అనుకుంటుంది. ఆధునిక ఆయుధాలతో పోరాటం చేస్తూ ఉంటారు అని.. కల్కి అవతారంలో ఉన్న ప్రభాస్ వారిని ఎదుర్కొని ప్రజల్ని ఎలా కాపాడారు అనేది స్టోరీ అంటూ సోషల్ మీడియాలో వాళ్లు రకాలుగా స్టోరీ వైరల్ అవుతుంది.
దేశవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా మొదటిగా జనవరి 12 సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధం చేసినట్టు ప్రకటించారు. అయితే కల్కి టైటిల్ వీడియోలో మాత్రం విడుదల తేదీని ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టడం జరిగింది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ కల్కి సినిమా విడుదల తేదీ పై మరికొన్ని రోజుల్లో క్లారిటీ అయితే రానున్నది.