ప్రభాస్‌ అభిమానులకు సువర్ణ అవకాశం..!

0
129
Prabhas Movie Project K Team Calls For Casting Auditions

Prabhas Project K: యంగ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అనే విషయం తెలిసిందే. ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ (Radhe Shaym) సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

ఇక దీంతో పాటు ప్రభాస్ బాలీవుడ్‌లో స్టార్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ అనే సినిమా చేస్తున్నారు. మరో సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’(Salaar) . ఇక ఇటీవలే ఆయన మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమాను ప్రారంభించారు. ‘ప్రాజెక్ట్ కే’ (Project K) పేరుతో ఈ సినిమా ప్రారంభం అయింది.

ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కోసం ఎన్నో వందల మంది ఎదురుస్తుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇంతకముందు ఎప్పుడు ఆయన సినిమాల కోసం కాస్టింగ్ కాల్ నిర్వహించలేదు. మొట్టమొదటిసారి ప్రభాస్‌ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా కోసం చిత్రబృందం ఆడిషన్స్ నిర్వహిస్తోంది.

Prabhas Movie Project K Team Calls For Casting Auditions

నాగ్ అశిన్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ K’. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొన్ నటించబోతోంది. బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ మూవీ సంబంధించిన క్యాస్టింగ్ కాల్ ప్రకటన విడుదల చేశారు. ”కెమెరా సెట్ చేయబడింది. ‘ప్రాజెక్ట్ఖ్K’ మీ రాష్ట్రానికి వస్తోంది. మీరొక యాక్టర్, మోడల్, డ్యాన్సర్, మార్షల్ ఆర్టిస్ట్ లేదా పెరఫార్మ్ చేయడానికి ఇష్టపడే వారెవరైనా ఉంటే భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఆడిషన్ష్‌కు మీ ప్రొఫైల్‌ను మాకు మెయిల్ చేయండి” అని మేకర్స్ ట్వీట్ చేశారు.