Project K షూటింగ్ మొదలు పెడుతున్న ప్రభాస్.!

0
147
Prabhas Nag Ashwin Project K Shooting Update
Prabhas Nag Ashwin Project K Shooting Update

Prabhas Project K Shooting: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే, ఇటీవలే ఆదిపురుష షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ పూర్తి చేయడంతో, ప్రభాస్ ఇప్పుడు తన దృష్టిని చాలా కాలం క్రితం అధికారికంగా ప్రారంభించిన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే (Project K Shooting) వైపు మళ్లించాడని అంటున్నారు.

గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ కాస్త స్లోగా సాగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ఈ ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించడంతో షూటింగ్ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నాగ అశ్విని సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు Project K సంబంధించి క్యాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు. దీనిని బట్టి సినిమా షూటింగ్ ని మరింత స్పీడ్ తో కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఈ సినిమా కోసం ప్రభాస్ త్వరలోనే సరైన గెటప్ మారతాడని, ఆ తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి భారీ షూటింగ్ సెట్ రామోజీ ఫిలిం సిటీ లో క్రియేట్ చేశారు. మేజర్ షూటింగ్ అంతా అక్కడే జరిగేటట్టు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Prabhas Nag Ashwin Project K Shooting Update
Prabhas Nag Ashwin Project K Shooting Update

KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా సోలార్ షూటింగ్ కూడా చివరిదశలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకనే ప్రభాస్ ఇప్పుడు తన ఫోకస్ అంతా Project K సినిమా పై దృష్టి పెట్టినట్టు ఫిల్మ్నగర్లో టాక్ నడుస్తోంది.

మరోవైపు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయిక. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం కాన్సెప్ట్‌ విస్తృతంగా ఉంటుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.

 

Web Title: Prabhas Nag Ashwin Project K Shooting Update – Prabhas upcoming movies 2022 -project k movie prabhas – prabhas nag ashwin movie budget

Previous articleభీమ్లా నాయక్ కోసం మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ రెడీ
Next articleKalyan Ram Bimbisara Teaser on Nov 29