Prabhas Role In Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ (Radhe Shyam) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. దీని తరవాత ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ (Salaar), నాగశ్విన్ తో కలిసి ‘ప్రాజెక్ట్ కె’ (ProjectK) వంటి సినిమాలు చేయబోతున్నారు.



అయితే ప్రభాస్ వీటితోపాటు స్పిరిట్ (Spirit) మూవీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సలార్’ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) రోల్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
స్పిరిట్ (Spirit) చిత్రాన్ని హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్ గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) పాత్ర ఎలా వుండబోతుందనే విషయాన్ని నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas Role) టిపికల్ పోలీస్ కాప్ గా కనిపించబోతున్నాడంట.
ఇప్పటివరకు ప్రభాస్ పోలీస్ (Prabhas police role) గా ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇందులోనే మొట్ట మొదటిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని చెప్పాంతో ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్ కి పోలీస్ ఆఫీసర్ రోల్ యాప్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఈ న్యూస్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు మేకర్స్.



సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ ను వెండితెరపై ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఆదిపురుషో షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ కూడా చివరి షూటింగ్లో ఉంది. అలాగే నాగ్ అశ్విన్ మూవీ కూడా మాత్రం మార్చి నుంచి షూటింగ్ కి వెళ్తున్నారు.
ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా సినిమా వచ్చే ఏడాదిలో మొదలుకానుంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి ‘యానిమల్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.