Prabhas Pooja Hegde Radhe Shyam Title Motion Poster Date Confirmed

Prabhas Radhe Shyam Postion Poster: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రాధేశ్యామ్”. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణా మూవీస్ – టీ సిరీస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అక్టోబర్ 23వ తేదీన ఆయన జన్మదిన వేడుక జరుగనుంది. దీంతో ఆయన బర్త్ డే కానుకగా ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్ అనౌన్స్ చేసిన మూడు సినిమాల్లో ‘రాధేశ్యామ్’ ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది కాబట్టి టీజర్ లేదా మోషన్ పోస్టర్ రావొచ్చని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే ‘రాధే శ్యామ్’ టీమ్ డార్లింగ్ బర్త్ డే గిఫ్ట్ అనౌన్స్ చేసింది. ఆయన బర్త్ డే గిఫ్ట్‌గా ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో ‘రాధేశ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ మెసేజ్ పోస్ట్ చేసిన చిత్రయూనిట్.. ”వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా లవ్‌లో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం” అని ప్రకటించారు.

Prabhas to unveil motion poster of Radhe Shyam on his birthday

కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్ నిలిపివేసిన యూనిట్.. ప్రస్తుతం‌ ఇటలీలో మిగిలిన భాగం షూటింగ్ చేస్తోంది. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.