అఫీషియల్: ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్..వచ్చే ఏడాది ఏప్రిల్‌లో

450
Prabhas Prashant Neel Salaar Releasing Worldwide On 2022 April 14th

‘కె.జి.యఫ్’ లాంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ ద్వయం ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. కన్నడ యాక్టర్ మధు గురుస్వామి విలన్‌గా నటిస్తున్నాడు.

ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్‌ను చూపించనున్నారు ప్రశాంత్ నీల్. జనవరి 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల కొద్ది రోజుల పాటు తెలంగాణలోని రామగుండం బొగ్గు గనల్లో ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఆ మధ్యకాలంలో లీకైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బొగ్గు గనుల్లో పనిచేసే నాయకుడి పోరాటం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అయితే, ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఆదివారం ప్రకటించింది.

రీసెంట్ గా ‘రాధే శ్యామ్’ విడుదల తేదీని ప్రకటించిన ప్రభాస్.. తాజాగా ఆయన నటిస్తున్న ‘సలార్’ సినిమా థియేట్రికల్ రిలీజ్ తేదీని ఆదివారం ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవిలో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు హోంబలే ఫిలింస్ ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. కాగా, ‘సలార్’ విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ సినిమాలతో పాటుగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో కూడా బాగా బిజీగా ఉన్నాడు.తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Prabhas Salaar Movie Working stills and HD Posters Prabhas Salaar Movie Working stills and HD Posters