Radhe Shyam: మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రభాస్..!

0
29
Prabhas' Radhe Shyam Creates Record Even Before Releases

Prabhas Radhe Shyam: బాహుబలి విడుదల తర్వాత ప్రభాస్​ రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది. కేవలం పాన్​ ఇండియా లెవల్​లో భారీ బడ్జెట్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు ప్రభాస్​. అందులో భాగంగానే.. యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై రాధేశ్యామ్​ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడు. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పది రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉందనే సంగతి తెలిసిందే.

షూటింగ్ పూర్తైతే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పిరియాడికల్​ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్​ విక్రమాధిత్యగా కనిపిస్తున్నాడు. ఇక ప్రేరణ అనే యువతి పాత్రను పూజా హెగ్డే చేస్తోంది. అయితే రిలీజ్ కాకుండానే ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతున్నాయి.

కొన్ని నెలల క్రితం రాధేశ్యామ్ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మోషన్ మోస్టర్ కు యూట్యూబ్ లో ఏకంగా 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇండియాలో ఇప్పటివరకు మరే మోషన్ పోస్టర్ ఈ స్థాయిలో వ్యూస్ ను సాధించలేదు. పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజైన తర్వాత ఇంకెన్ని రికార్డులను ఖాతాలో వేసుకుంటుందో చూడాల్సి ఉంది..