Prabhas Radhe Shyam Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు లవ్ అంటే కొత్త అర్థం తెలపడానికొస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పూర్తిగా లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో వరల్డ్ వైడ్ ప్రభాస్ అభిమానుల్లో ఆతృత నెలకొంది.
ఈ అద్భుతమైన ప్రేమ కథకు సంబంధించి ‘రాధే శ్యామ్’ నిర్మాతలు ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభాస్ పోస్టర్లో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే ఎప్పటిలాగే అద్భుతంగా కనిపిస్తుంది. బ్లూ డ్రెస్ పై నెమలి పింఛం అలంకరణతో కృష్ణాష్టమికి రిలేటెడ్ గా కన్పిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు.
మరోవైపు ప్రభాస్ ”సలార్”, ”ఆదిపురుష్”, ”ప్రాజెక్ట్ కే” వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు కూడా విభిన్నమైన జోనర్లో తెరకెక్కుతుండటం విశేషం. గతంలో ”రాధే శ్యామ్” చిత్రం నుంచి విడుదలైన ప్రభాస్, పూజాహెగ్డే పోస్టర్లకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.
చిత్రంలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణంరాజు రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందట. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.