‘రాధేశ్యామ్’ శివరాత్రి లుక్: రొమాంటిక్ మూడ్‌లో ప్రభాస్, పూజా హెగ్డే

303
Prabhas Radhe shyam Special Poster Released On Maha Shivratri

రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా చాలా రోజుల పాటు షూటింగ్ జరుపుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. జులై 30వ తేదీన భారీ ఎత్తున్న ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు జెస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. జూలై 30న విడుదలకు సిద్ధమవుతోన్న రాధేశ్యామ్ చిత్ర బృందం ఇంతవరకూ టీజర్ ను విడుదల చేయలేదు. గతంలో వచ్చిన మోషన్ పోస్టర్, ఇతర పోస్టర్స్ మాత్రమే అభిమానుల్ని మెప్పించాయి. ఇక నేడు శివరాత్రి సందర్భంగా యూవీ క్రియేషన్స్ వారు ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.

ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మంచులో వ్యతిరేక దిశల్లో పడుకుని కనిపిస్తున్నారు. ఇద్దరూ ఆకాశం వైపు చూస్తూ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో అంతా ఆకర్షితులవుతున్నారు. రొమాన్స్ చేసుకుటంటున్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రేమకథ మీ గుండెల్లో కలకాలం నిలిచిపోతుంది’… అంటూ పొయటిక్ గా దీన్ని రివీల్ చేశారు మేకర్స్ .

ఈ భారీ సినిమాలో కృష్ణం రాజు ప్రధానమైన పాత్రను చేస్తున్నారు. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Prabhas Pooja Radhe Shyam Special Poster