Prabhas Role Revealed In upcoming 'Jaan' Movie
Prabhas Role Revealed In upcoming 'Jaan' Movie

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న ‘సాహో’ చిత్రం మొత్తానికి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుని, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అయింది. దాంతో ప్రభాస్ తన తరువాత సినిమా జాన్ పై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి. పైగా 1960 కాలంలో ఈ కథ సాగుతుందట, ప్రభాస్ హీరోగా ఫుల్ ఎంటర్టైనర్ గా జాన్ ను తెర పై ఆవిష్కరిస్తున్నారట.

కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. అయితే అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న ‘సాహో’ చిత్రం నెగిటివ్ టాక్ తో బలమైన ఓపెనింగ్స్ ను కంటిన్యూ చేయకపోవడంతో ప్రభాస్ ఫీల్ అయ్యాడని… ముఖ్యంగా సాహో ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమా బాగా సీరియస్ గా సాగడమే అని.. అందుకే జాన్ లో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్ .