రికార్డ్ స్థాయి రేటింగ్ ‘సాహో’ హిందీ టీవీ ప్రీమియర్

Prabhas Saaho another rare record on World Television Premiere show on Republic Day
Prabhas Saaho another rare record on World Television Premiere show on Republic Day

(Prabhas Saaho another rare record on World Television Premiere show on Republic Day.. Prabhas upcoming movie latest updates..)ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో చిత్రంను తెలుగు ప్రేక్షకులు అంతగా ఆధరించలేదు కాని బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. హిందీ మార్కెట్ లో ప్రభాస్ క్రేజ్ విమర్శకులను సైతం విస్మయానికి గురి చేసింది. కలెక్షన్స్ విషయంలోనే కాకుండా అమెజాన్ మరియు నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అయిన సమయంలో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా యమ చూశారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమా హిందీలో జీ సినిమా ఛానల్ లో వరల్డ్ టీవీ ప్రీమియర్ జరుపుకుంది. టీవీలో కూడా సినిమా రెస్పాన్స్ అదిరిపోయింది.

తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా జీ సినిమా ఛానెల్ లో జనవరి 26న వరల్డ్ టీవీ ప్రీమియర్ వేయడం జరిగింది. అనూహ్యంగా ఈ చిత్రానికి భారీ స్పందన వచ్చింది. టీవీల్లో కూడా ఈ సినిమాను తెగ చూశారు. 2020 నాల్గవ వారంలో రేటింగ్ విషయంలో సాహో మొదటి స్థానం లో నిలిచింది. ఈ ఏడాది లో ఇప్పటి వరకు సాహోనే టాప్ ప్లేస్ లో నిలిచింది. టీఆర్పీ లెక్కల ప్రకారం సాహూ వరల్డ్ టీవీ ప్రీమియర్ కు 128.20 లక్షల వ్యూయర్ షిప్ ఇంప్రెషన్స్ వచ్చాయట. దీనితో సాహూ అత్యధిక రేటింగ్స్ సాధించిన హిందీ సినిమాలలో ఐదో ర్యాంకుకు చేరింది.

సల్మాన్ ఖాన్ భారత్, హ్రితిక్ రోషన్ సూపర్ 30 కంటే సాహూ కే ఎక్కువ రేటింగ్స్ రావడం గమనార్హం. ఇది హిందీ మర్కెట్స్ లో ప్రభాస్ పాపులారిటీని సూచిస్తుంది. సాహో చిత్రం థియేటర్ల లో.. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై చూసి కూడా మళ్లీ చాలా మంది ప్రేక్షకులు జీ సినిమా ఛానెల్ లో చూసేందుకు ఆసక్తి చూపడం వల్లే ఈ స్థాయి రేటింగ్ నమోదు అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాహో చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లో తన స్థానంను మరింత పదిలం చేసుకున్నాడు..