Prabhas Saaho Teaser Biggest Recard In Tollywood Industry
Prabhas Saaho Teaser Biggest Recard In Tollywood Industry

టాలీవుడ్ లో తయారయిన ఇంటర్నేషనల్ అప్పీల్ ఉన్న యాక్షన్ మూవీ సాహో కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.ఏకంగా 350 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా గురించి ట్రేడ్ అంతా కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు.అయితే ఈ సినిమాకి సెన్సార్ దగ్గర చిన్న డిస్ట్రబెన్స్ వచ్చింది అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.నిజానికి సాహో లో యాక్షన్,రొమాన్స్ మునుపెన్నడూ ఏ తెలుగు సినిమాలో చూడని విధంగా ఉన్నాయి అనేది ఒప్పుకుని తీరాలి.దాంతో ఈ సినిమాకి విత్ అవుట్ కట్స్ ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడాన్నికి సెన్సార్ బోర్డు నిర్ణయించిందట.కట్స్ అండ్ సౌండ్ మ్యూట్స్ తో అయితే మాత్రం U/A మాత్రమే ఇస్తాం అని చెప్పినట్టు సమాచారం.

సాహో కేవలం తెలుగు సినిమా అయితే పరవాలేదు.కానీ ఇది పాన్ ఇండియన్ మూవీ.A సర్టిఫికెట్ ఇస్తే చాలా చోట్ల నిబంధనల ప్రకారం పిల్లలను అనుమతించరు.ఇది ఖచ్చితంగా సినిమా రెవెన్యూ పై ఎఫెక్ట్ చూపించే పాయింట్.అందుకే కట్స్ అండ్ మ్యూట్స్ లేకుండా U/A సంపాదించడానికి అవుట్ ఫుట్ పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేపడుతుంది అని టాక్.మొత్తానికి రేపో,ఎల్లుండో సెన్సార్ సర్టిఫికేషన్ అయిపోతే టీమ్ సాహో రిలీజ్ అండ్ రిజల్ట్ కోసం మాత్రమే వెయిట్ చెయ్యొచ్చు.సెన్సార్ కంప్లీట్ అయితే ఈ సినిమా రన్ టైం ఎంత అనే విషయంలో కూడా కాస్త క్లారిటీ వస్తుంది.