కలవరపెడుతున్న ‘సాహో’

Prabhas Saaho In Trouble,VFX Not Yet Completed, Release Date
Prabhas Saaho In Trouble,VFX Not Yet Completed, Release Date

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సాహో.హై వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహో భారీ పోటీ మధ్య ఆగస్టు 15 న థియేటర్స్ లోకి రావడం ఖాయం అయిపోయింది.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.మరీ పీక్ రేంజ్ లో కాకపోయినా కూడా ఒక మోస్తరుగా ప్రొమోషన్స్ జరుగుతున్నాయి.ఈ సినిమా ఫస్ట్ హాఫ్ గంట 20 నిమిషాల నిడివితో లాక్ అయ్యింది.అయితే సెకండ్ హాఫ్ కూడా లాక్ అయ్యాక అప్పుడు ఫైనల్ అండ్ సెన్సార్ వెర్షన్ ని రెడీ చేస్తారు.కాకపోతే ఈ సినిమాకే అతి కీలకమయిన అబుదాబి ఫైట్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో వస్తుంది.దాని నిడివి పది నిమిషాలపైనే ఉంటుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఆ ఎపిసోడ్ లో సంబంధించి ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తకాలేదు అని సమాచారం.సినిమాకే హైలైట్ గా నిలవాల్సిన ఆ ఎపిసోడ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో టీమ్ టెన్షన్ పడుతున్నారు.ఆ కాస్ట్లీ ఎపిసోడ్ సినిమలో లేకపోయినా,క్వాలిటీగా లేకపోయినా ఆ ఇంపాక్ట్ సినిమాపై ఉంటుంది.అందుకే ఆ టీమ్ ని తొందరపెట్టకుండా వీలైనంత త్వరగా పూర్తి చెయ్యమని డెడ్ లైన్ మాత్రమే పెట్టారట.ఆ ఎపిసోడ్ మినహా మిగతా సినిమా అంతా రెడీ చేస్తున్నారు.ఎట్టిపరిస్థితుల్లో సాహో ఫైనల్ కట్ జులై 31 కి రెడీ అయిపోవాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]

అందుకోసం అంతా అందుబాటులో ఉంటూ టైం లిమిట్ లేకుండా,అదే టైం లో క్వాలిటీ తగ్గకుండా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తున్నారు.మరి కనీసం ఆ డెడ్ లైన్ టైం లో సాహో లో సాహో అనిపించే ఆ ఎపిసోడ్ పూర్తయిపోతే సినిమా టీమ్ ఊపిరి పీల్చుకుంటుంది.లేదంటే మాత్రం కాస్త కష్టమే.ఈ డేట్ తప్పితే సినిమాకి అన్ని రకాలుగా నష్టమే.మరి టీమ్ సాహో ఈ ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏమో?.