Prabhas Saaho Movie Posters & Teaser Copied from Hollywood _
Prabhas Saaho Movie Posters & Teaser Copied from Hollywood _

బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా.డొమెస్టిక్ మార్కెట్ మాత్రమే తెలిసిన తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ మార్కెట్ డోర్స్ ని పూర్తిగా ఓపెన్ చేసిన సినిమా.అయితే ఆ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని ఆ తరువాత చాలా సినిమాలు వచ్చినా ఆ మ్యాజిక్ రీ క్రియేట్ కాలేదు.కానీ ఆన్ స్క్రీన్ లో బాహుబలి గా అదరగొట్టిన ప్రభాస్ మాత్రం మళ్ళీ తన సినిమాతోనే బాహుబలి రేంజ్ ని టచ్ చెయ్యాలి అనే టార్గెట్ పెట్టుకున్నాడు.

అందుకే బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా 300 కోట్ల తో డేరింగ్ గా సాహో నిర్మాణంలో సైతం కీ రోల్ పోషించాడు.బాహుబలికి సాహో కి కొన్ని పోలికలు మాత్రం అనివార్యం అనిపిస్తన్నాయి.వాటిలో కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటే మరికొన్ని నెగెటివ్ గా కూడా ఉన్నాయి.సాహో ఆ సినిమాకి సంబందించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.ఆ పిక్ లో ప్రభాస్ VFX సెట్ లాంటి ఒక స్పెక్ట్స్ తో కనిపిస్తున్నాడు.ఆ పోస్టర్ అదిరిపోయింది.కానీ అది ఒరిజినల్ కాదు అని ఒక ఫారెన్ ఫిలిం పోస్టర్ కాపీ కొట్టారు అంటూ ఒరిజినల్ ని కూడా కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.గతంలో కూడా బాహుబలి రెండు పార్ట్స్ కి సంబందించిన పోస్టర్స్ పై ఇలాంటి కాపీ ఆరోపణలే వచ్చాయి.బాహుబలి లో కుంతల రాజ్యం మీద దోపిడీ దొంగలు పడ్డప్పుడు ఎద్దుల కొమ్ములకు నిప్పు అంటించే సీన్ ఉంది.ఆ సీన్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి గుర్రాల సీన్ ని కాపీ కొట్టి తీశారు అని మాట్లాడారు.ఇక ఇప్పుడు సాహో కి కూడా ఈ కాపీ ఆరోపణలు తప్పట్లేదు.

రీసెంట్ గా సాహో నుండి సెకండ్ సింగిల్ కి సంబందించిన టీజర్ ఇచ్చారు.ఇప్పుడు అది కూడా కాపీ అనేస్తున్నారు.ఒక ఇంగ్లీష్ పాప్ ఆల్బమ్ కి సంబదించిన ‘డోంట్ గో అవే’ అనే సాంగ్ ని ఇలా సాహో కోసం ఒక డ్యూయెట్ గా మార్చేశారు అనే మాట వినిపిస్తుంది.బాహుబలి సినిమాలో చాలా ఎలిమెంట్స్ కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.వాటిలో ఒకటి ఆ సినిమా కథకి మూలం అయిన మాహిష్మతి రాజ్యం.ఆ సినిమాలో మాహిష్మతి సెట్స్ ప్రేక్షకులను మెస్మరైస్ చేసాయి.ఇప్పుడు సాహో కి సంబంధించి కూడా అలాంటి ఒక సిటీ సెట్ వేశారు.కానీ అది ఫ్లాష్ బ్యాక్ తరహాది కాదు.ఫ్యూచర్ లో వరల్డ్ ఎలా ఉండబోతుంది అనే విషయానికి సంబందించినది.సో,ఇది కూడా సాహో కి చాలా కీలకంగా మారబోతుంది అని టాక్.ఇలా అనేక విషయాల్లో సాహో,బాహుబలిని ఫాలో అయిపోతుంది.మరి ఫలితం కూడా బాహుబలికి దరిదాపుల్లో ఉంటే తెలుగు సినిమా మరొక మైల్ స్టోన్ ని అచీవ్ చేసినట్టే.