Prabhas, Shraddha Kapoor, Saaho Official Teaser, Tollywood Movie News
Prabhas, Shraddha Kapoor, Saaho Official Teaser, Tollywood Movie News

 

బాహుబలి తో తెలుగు సినిమా స్టామినాని రీ డిఫైన్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సాహో అంటూ వస్తున్నాడు.ఇప్పటివరకు ఈ సినిమాకి సంబందించిన రకరకాల వార్తలు వింటూనే సాహో అనుకున్నారు అంతా.ఫస్ట్ టైం ఈ సినిమా రేంజ్ ని తెలుపుతూ క్రేజ్ ని పెంచేలా ఒక మైండ్ బ్లోయింగ్ టీజర్ ఇచ్చారు.టీజర్ ఆసాంతం కళ్ళు తిప్పుకోలేని గ్రాండ్ అండ్ స్టైలిష్ విజువల్స్ తో హాలీవుడ్ సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమానే అనిపించింది.

షేడ్స్ ఆఫ్ సాహో లో చూపించిన ప్రభాస్ లుక్ కేవలం శాంపిల్ మాత్రమే.టీజర్ లో ప్రభాస్ స్టైల్ మాత్రం ఫ్యాన్స్ వరకే కాదు అందరికి సూపర్ గా నచ్చేసింది.ఇక కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా టెన్స్ సిట్యుయేషన్ లో కూడా ప్రభాస్ పండించిన సటిల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అన్ని షేడ్స్ ని కవర్ చేశారు అని కన్వే చేస్తుంది.ఓవర్ ఆల్ గా సాహో టీజర్ మైండ్ బ్లోయింగ్ అనే మాటకి ఏ మాత్రం తగ్గకుండా ఉంది.అందుకే ఈ సినిమాకి బిజినెస్ కూడా బాహుబలిని మించి జరుగుతుంది.ఆంధ్ర ప్రదేశ్ వరకే థియేటర్ రేట్స్ 60 కోట్లు పలుకుతున్నాయి అని టాక్.కేవలం తెలుగు రైట్స్ తో 120 కోట్లు రాబట్టడం అనే టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోయేలా ఉన్నారు.

ప్రభాస్ ప్రభంజనం కేవలం బాహుబలి వరకే పరిమితం అనుకున్నవాళ్ళ ఒపీనియన్ తప్పు అని ప్రూవ్ చేసింది సాహో టీజర్.ఈ సినిమా టీజర్ కి కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లో భారీ రెస్పాన్స్ వస్తుంది.ఇక హిందీ వెర్షన్ ట్రైలర్ చూసి నోళ్లు వెళ్ళబెటేస్తున్నారు బాలీవుడ్ జనాలు.ఇక హిందీ టీజర్ లో మరో షాక్ ప్రభాస్ ఓన్ డబ్బింగ్.శాంపిల్ గానే ఉన్న ప్రభాస్ ఓన్ వాయిస్ తో వింటే ఆ కిక్కే వేరు అన్నట్టు ఉంది.

సాహో సినిమా హిందీ వెర్షన్ కి మాత్రమే T సిరీస్ సమర్పకులుగా ఉన్నారు అని టీజర్ తో క్లారిటీ వచ్చింది.టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో శ్రద్దా కపూర్ కి కూడా క్రూషియల్ రోల్ దక్కినట్టు తెలుస్తుంది.కేవలం నటన కి మాత్రమే పరిమితం అయిపోలేదు.ప్రభాస్ తో కలిసి ఫైట్స్ కూడా చేసేస్తోంది.ఇక అబుదాబి లో తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తుంటే వాటిగురించి విన్నది చాలా తక్కువ అనిపిస్తుంది.సాహో టీజర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది అని చెప్పొచ్చు.ఐ క్యాచింగ్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన సాహో ఆగష్టు 15 న బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టించబోతుంది.