సాహో…ఇంకా మొదలుపెట్టాలి

Prabhas Saaho Teaser Biggest Recard In Tollywood Industry
Prabhas Saaho Teaser Biggest Recard In Tollywood Industry

ఆగస్టు 15 కోసం సినిమా లవర్స్ కూడా ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే మేకింగ్ స్టేజ్ నుండే వార్తల్లో నిలిచిన సాహో అదే రోజు ప్రేక్షకులందుకు రాబోతుంది.అయితే బాహబలి సినిమాతో నార్త్ లో కూడా స్టార్డం తెచ్చుకున్న ప్రభాస్ దాన్ని నిలబెట్టుకుంటాడా? లేదా? అనే విషయం కూడా అప్పుడే తేలుతుంది కాబట్టి ఈ సినిమాపై అంతా చాలా అటెన్షన్ గా ఉన్నారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ ఆ అటెన్షన్ ని నమ్ముకుని ఇంత పెద్ద సినిమాకి ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యకపోవడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.ప్రస్తుతం ఆస్ట్రియా లో సాంగ్ షూటింగ్ లో ఉన్న సాహో టీమ్ అక్కడినుండి తిరిగివచ్చాక అయినా బాలీవుడ్ లో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చెయ్యకపోతే సాహో అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేదేమో అన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కూడా అఫీషియల్ గా అమ్ముడు పోయాయి.వాటి రైట్స్ దాదాపు 50 అని టాక్.ఫార్స్ ఫిల్మ్ సాహో ఓవర్సీస్ రైట్స్ దక్కించుకుంది.యష్ రాజ్ ఫిలిమ్స్ తో అసోసియేట్ అయ్యి ఫార్స్ ఫిల్మ్ సాహో ని రిలీజ్ చేస్తుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

మిగతా డీల్స్ కూడా వారం రోజుల్లో ఫైనల్ అయిపోయే అవకాశం ఉంది.అయినా ఇంకా సాహో టీమ్ సైలెంట్ గానే ఉంది.ఈ 250 కోట్ల బడ్జెట్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి టీమ్ సాహో ఎలాంటి ప్లానింగ్ రెడీ చేసుకుందో మరికొంతకాలం ఆగితే తప్ప తెలియదు.ఏది ఏమైనా సాహో మాత్రం స్పీడ్ పెంచాల్సిందే.

[INSERT_ELEMENTOR id=”3574″]