shraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal
shraddha kapoorshraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal

సాహో…ఈ సిమిమా రిలీజ్ కి ఇంకా టైం ఉంది.కానీ అప్పుడే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిపొయింది అనేమాట వినిపిస్తూ షాక్ ఇస్తుంది.బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో మామూలుగానే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.కాకపోతే ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే రెండువందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం అంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ కి కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్నా ప్రభాస్ అండ్ యూవీ క్రియేషన్స్ గుడ్ విల్ మాత్రం సినిమా బిజినెస్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి.విజువల్స్ ఎంత ప్రామిసింగ్ గా,స్టన్నింగ్ గా ఉన్నాయి అనేది టీజర్ లోనే తెలిసింది.దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120 కోట్లవరకు హక్కులు అమ్మారు అనేది సమాచారం.ఇక మిగిలిన చోట్ల కూడా బాహుబలికి ఏ మాత్రం తగ్గకుండా బిజినెస్ చెయ్యడంతో ఇప్పటికే 255 కోట్లతో ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోస్ అయ్యింది అంటున్నారు.రిలీజ్ టైం కి ఈ నెంబర్ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.