Prabhas Saaho Teaser Biggest Recard In Tollywood Industry
Prabhas Saaho Teaser Biggest Recard In Tollywood Industry

అంతా ఎదురుచూస్తున్న సాహో సంచలనాలు మొదలయ్యాయి.ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతూనే భాషాబేధం లేకుండా అన్ని భాషల్లో వ్యూస్ పరంగా దుమ్మురేపింది.ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు షేర్స్,లైక్స్ కొట్టడంతో సోషల్ మీడియా షేక్ అయ్యింది.ప్రభాస్ క్యాలిబర్ మీద ఎవరికయినా అనుమానం ఉంటే అది సాహో టీజర్ తీర్చేసింది.కేవలం ఆరుగంటల వ్యవధిలో 25 మిలియన్స్ డిజిటల్ వ్యూస్ సాధించి ఈ సినిమా గురించి వెయిటింగ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పకనే చెప్పింది.

అలాగే అతి తక్కువ టైం లో 50 మిలియన్ వ్యూస్ అందుకుని 100 మిలియన్స్ దిశగా దూసుకుపోతుంది.అలాగే యు ట్యూబ్ వరకు చూసుకున్నా కూడా ఏ తెలుగు సినిమాకి….ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఏ ఇండియన్ సినిమాకి సాధ్యం కానీ రికార్డ్ సాహో ఖాతాలో చేరింది.అదే 24 గంటల్లోపు మిలియన్ వ్యూస్.బాలీవుడ్ లో సైతం సాహో కి బ్రహ్మరధం పట్టడంతో తమకు కొత్త అపోజిషన్ వచ్చిందని కంగారు పడుతున్నారట ఖాన్స్.

ఆశ్చర్యకరంగా సాహో తమిళ్ వెర్షన్ సైతం అక్కడి స్టార్ హీరోస్ కి ఏ మాత్రం తీసిపోని రీతిలో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది.మలయాళంలో కూడా మిలియన్ వ్యూస్ దక్కాయి.కేవలం ప్రభాస్ ప్రభావం బాహుబలి వరకే అని సరిపెట్టుకున్న ట్రేడ్ కూడా సాహో క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు.సాహో ఫలితం ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకం మాత్రం ఆగే ప్రస్తకే లేదు.