ప్రభాస్ సాహోరే సాహో

Prabhas Thanks To Movie Industry For Supporting Solo Release Of Saaho
Prabhas Thanks To Movie Industry For Supporting Solo Release Of Saaho

గత కొంతకాలంగా ఇండియన్ సినిమా అంతా ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్ మూవీ సాహో.ఈ సినిమా థీమ్ అండ్ టోన్ ఏంటి అనేది అందరికి తెలిసిందే.అందుకే ట్రైలర్ లో ఏం చూపిస్తారు అన్న క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది.కానీ ట్రైలర్ తో సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు అంతకుమించి చాలా ఉంది అని క్లారిటీ వచ్చేసింది.ముఖ్యంగా ఇప్పటివరకు పెద్దగా ఫోకస్ చెయ్యని హీరో-హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కి కూడా స్పేస్ ఇచ్చారు.అది సినిమాపై పోజిటివిటీ ని మరింతగా పెంచింది.

అంతే కాదు కేవలం 24 గంటల్లో ఏకంగా 52 మిలియన్స్ కి పైగా డిజిటల్ వ్యూస్ సాధించిన సాహో ట్రైలర్ సినిమా సాధించబోయే సంచలనాలకు శాంపిల్ గా నిలిచింది.ఇక ట్రైలర్ అంతా సినిమా టైటిల్ కి తగ్గట్టుగా సాహో అనిపించేసినా ముందు నుండి చెబుతున్న ఫ్యూచరిస్టిక్ సిటీ మాత్రం సినిమాకే హైలైట్ గా నిలిచింది.ఆ సిటీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ యాక్షన్ సినిమాల్లో ఇప్పటివరకు చూడని కొత్త తరహా విజువల్స్ తో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అని తేలిపోయింది.యాక్షన్ సీన్స్ కే ఫుల్ ఫిదా అయిపోతుంటే మరొకపక్క ఈ సినిమాలో స్క్రీన్ ప్లే లో ఉన్న మలుపులు ఆకట్టుకుంటాయి అనే మాట సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా కాదు ఆకాశాన్ని కూడా దాటేసేలా చేస్తుంది.

ప్రభాస్ లుక్స్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్,కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్,స్టెల్లార్ స్టార్ కాస్ట్ మాత్రమే కాదు ఈ సినిమాకి మరొక బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది గిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.ఇంత పెద్ద సినిమాకు అతను న్యాయం చెయ్యగలడా అనే సందేహం ముందు చాలా మందికి ఉండేది.కానీ ట్రైలర్ చూసాక గిబ్రాన్ కాకుండా ఎవ్వరూ కూడా ఈ సినిమాకి న్యాయం చెయ్యలేరు అనిపించేలా అవుట్ ఫుట్ ఇచ్చాడు.ఇక టెక్నీకల్ గా సైతం ఈ సినిమా నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండడం కాదు ఏకంగా ఇంటెర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ అవుతుంది.సో,ఆగస్టు 30 న అన్ని రకాలుగా అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం రెడీ అయిపోవాల్సిందే అనే మాట మాత్రం యునానిమస్ గా వినిపిస్తుంది.