Salaar Hollywood Version: ప్రభాస్ రాబోయే సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా సలార్ మూవీ కూడా ఒకటి. సలార్ సినిమాని ప్రశాంత్ నేను కేజిఎఫ్ సిరీస్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
Salaar Hollywood Version: కేజిఎఫ్ సిరీస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ఇప్పుడు దానికి మించి సలార్ సినిమాని షూటింగ్ జరుపుతున్నారు. కేజిఎఫ్ 2 సినిమాతో బిజినెస్ పై అవగాహన పెంచుకున్న ప్రశాంత్ ఇప్పుడు సలార్ మూవీని ఎక్కువ భాషల్లో విడుదల చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే ప్రభాస్ సినిమాని హాలీవుడ్ లో కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అయితే హాలీవుడ్ కి మన సౌత్ లో విడుదల చేసే వర్షన్ కి చాలా తేడాలు ఉంటాయని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. అలాగే సినిమా రన్ టైం కూడా దాదాపు 40 నిమిషాలు తేడా ఉంటుందంట.
ఇక వివరాల్లోకి వెళితే, సదర్ హాలీవుడ్ వర్షన్ కి ప్రత్యేకమైన డబ్బింగ్ టీం ని అలాగే సలార్ సినిమాలో ఉండే కామెడీ సీన్స్.. సాంగ్స్ ని తొలగించినట్టు కూడా తెలుస్తుంది. ఇంగ్లీష్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా యాక్షన్ సన్నివేశాలతోనే ఈ హాలీవుడ్ వర్షన్ ఉండే విధంగా డైరెక్టర్ రూపొందిస్తున్నారంట.
ఇక హాలీవుడ్ లో విడుదల చేయటం వలన ఈ సినిమాకి కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈసారి ప్రశాంత్ ఈ సినిమాతో 2000 కోట్ల కలెక్షన్ టార్గెట్ రీచ్ అవ్వాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే మొట్టమొదటిగా హాలీవుడ్లో అడుగుపెట్టిన తెలుగు హీరో ప్రభాస్ చరిత్రలో నిలుస్తారు.