ప్రభాస్ ‘సలార్’ డిజిటల్ హక్కులు ఎంతో తెలుసా.?

198
Prabhas Salaar Movie Digital Rights sold by Huge Price
Prabhas Salaar Movie Digital Rights sold by Huge Price

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా చేస్తున్న సినిమా సలార్. ఈ సినిమా ప్రారంభం నుంచే అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ సినిమాను జాతీయ స్థాయి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. అతడు ఈ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

 

ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్న ప్రశాంత్ ఆ తరువాత సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

 

అయితే ప్రస్తుతం సలార్ సినిమా ఓటీటీ హక్కులపై వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుందని, అందుకుగాను అన్ని భాషల్లో కలిపి  ఈ సినిమా డిజిటల్ హక్కులకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్దమయినట్లు టాక్ నడుస్తోంది. ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.