1970 బ్యాక్‌డ్రాప్‌ లో ప్రభాస్ సలార్‌ మూవీ…?

0
857
Prabhas Salaar Movie Shooting Update

Prabhas – Salaar: ‘రాధే శ్యామ్’ సినిమా తర్వాత ప్రభాస్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్.. మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ కంప్లీట్ చేసే పని లో వున్నాడు..దీని తరువాత సాలార్ మూవీ షూటింగ్ ప్రభాస్ స్టార్ట్ చేస్తారు..

పాన్‌ ఇండియన్‌ స్థాయిలో దాదాపు 150 కోట్ల వ్యయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’ సినిమా మైసూర్‌ నేపథ్యంలో 1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్‌, ఛేజింగ్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్.

ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ సింగరేణిలో పూర్తి చేసారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌‌ను ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ షెడ్యూల్లో శృతి హాసన్, ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.