సలార్ యాక్షన్ షురూ చేసిన ప్రభాస్..!

0
985
Prabhas Salaar Movie Shooting Updates

Prabhas Salaar: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తర్వాత షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ‘ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వైలెంట్’ అంటూ ప్రభాస్ ను సరికొత్త అవతారంలో చూపించి ప్రశాంత్ అందరిని సర్ప్రైజ్ చేసాడు.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిపోయిన ‘సలార్’ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ ను సోమవారం హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ షూటింగ్ లో నిన్న అర్థరాత్రి ఒంటి గంట వరకు పాల్గొన్నట్లు హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ షెడ్యూల్ లో ఆగస్టు 8 నుంచి ప్రభాస్ పాల్గొనే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చేయనున్నట్లు సమాచారం.

నగరంలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరణ చేయడానికి ఇప్పటికే చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది. ‘సలార్’ పూర్తి కాగానే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది‌. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ ‘ప్రాజెక్ట్ K’ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.