Prabhas Salaar shooting update, Salaar latest shooting update, Salaar production news, Salaar new release date, Prashanth Neel, Salaar Re Shoot details
ప్రభాస్ సినిమా సాలార్ విషయంలో అన్ని అనుకున్నట్టు జరిగినట్టయితే మరో మూడు రోజుల్లో సాలార్ మూవీ థియేటర్లో సందడి చేసేది. సాలార్ మూవీ పోస్ట్ ఫోన్ కావటం వల్ల అభిమానులే కాకుండా సగటు సినిమా అభిమాని కూడా నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు డెడ్‌లైన్‌కు చేరుకోవడానికి సాలార్ బృందం ఏకకాలంలో రీషూట్‌లు మరియు పోస్ట్ ప్రొడక్షన్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇక సాలార్ మూవీ (Salaar Movie) వివరాల్లోకి వెళితే, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల రిలీజ్ కు సిద్ధం కాలేదు అంటూ సోషల్ మీడియాలో కథనాలు నడిచాయి.. కానీ వాస్తవానికి సినిమా షూటింగు ఇంకా పూర్తి కాలేదంట. అలాగే ప్రశాంత్ నీల్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవటంతో సినిమాని పోస్ట్ ఫోన్ చేయాల్సి వచ్చింది.
ప్రభాస్ అభిమానులకు ఈ సినిమాపై బారి అంచనాలు ఉన్నాయి.. అలాగే ఆ అంచనాలకు తగ్గట్టు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు ప్రశాంత్ ఈ సినిమాని ప్రేక్షకులకి అందించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకనే ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజుల షూటింగ్ని ఈరోజు ప్రభాస్ లేకుండా ప్రారంభించడం జరిగింది.
కాకపోతే ఈరోజు మొదలుపెట్టిన షూటింగ్ ప్యాచ్ వర్క్ మాత్రమే అని తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి రీ షూట్ అలాగే ప్యాచ్ వర్క్ అనేది ఉంటానే ఉంటుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఔట్‌పుట్‌తో 100% సంతృప్తి చెందే వరకు సినిమాను విడుదల చేయకూడదని భావించే దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఈ సినిమాలో ఓ టాప్ సీనియర్ నటితో ఐటెం సాంగ్ చేద్దామని మేకర్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నారని, అయితే ప్రభాస్ మోకాలి గాయం కారణంగా ఇన్ని రోజులు ఆ పాటకు సిద్ధంగా లేరని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ మోకాలి గాయం ట్రీట్‌మెంట్ పూర్తి చేసి రెస్ట్ తీసుకుంటున్నాడు. అతను త్వరగా కోలుకుంటే త్రిష లేదా ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ చేయించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
కెజిఎఫ్ సిరీస్ నిర్మాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సాలార్’. ఈ చిత్రంలో శృతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.