Prabhas Salaar story: కేజీఎఫ్ మరియు కేజీఎఫ్ 2 మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ 1000 కోట్ల క్లబ్ డైరెక్టర్ గా భారతీయ సినీ ప్రపంచంలో ప్రత్యేక గౌరవం దక్కించుకున్నాడు. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీలి కాంబినేషన్లో వస్తున్న నెక్స్ట్ మూవీ సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ ప్రభాస్ కెరియర్ కి కూడా ఎంతో ఇంపార్టెంట్ దాంతో ఈ చిత్రంకు ఎక్కడలేని ప్రామినెస్ సంతరించుకుంది.
Prabhas Salaar story: త్వరలో విడుదల అని ఎంతగానో ఆశిస్తున్న ఈ చిత్రం చుట్టూ ప్రస్తుతం పలు రకాల రూమర్లు తిరుగుతున్నాయి. ప్రశాంత్ మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసి కన్నడ మూవీ ఉగ్రం తో సలార్ ను కంపేర్ చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రశాంత్ నిల్ ఉగ్రంకు బెటర్ వర్షంగా సలార్ ని తీస్తున్నాడు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సలార్ లో ఎటువంటి కనికరం లేని ఒక శక్తివంతమైన గ్యాంగ్స్టర్ రోల్ లో ప్రభాస్ నటిస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాలతో లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్ తో మూవీ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సలార్ కథా మరియు క్యారెక్టరైజేషన్ ప్రభాస్ కి ఉన్న పాన్ వరల్డ్ ఇమేజ్కు సూట్ అయ్యే విధంగా డిజైన్ చేశారట. అయితే మరోపక్క ఉగ్రం స్టోరీ లైను బాగా డెవలప్ చేసి కొంత మార్పులు చేసి ఈ సినిమా తీస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రం కోసం ప్రశాంత్ ని తన కథాంశంలో సంఘంలో గౌరవం మరియు విధేయత అనే రెండు కీలక అంశాల చుట్టూ ఇతివృత్తం ఉండేలా ప్లాన్ చేశాడు. ఉగ్రం మూవీ విషయంలోకి వస్తే తన ఫ్రెండ్ కు చేసిన ప్రామిస్ కోసం ప్రత్యర్థి మాఫియా ముఠాలకు వ్యతిరేకంగా కథానాయకుడు చేసే యుద్ధం ప్రేక్షకులను ఆద్యంతం ఆకర్షిస్తుంది. ఇప్పుడు సలార్ చిత్రంలో కూడా ఒక సాలిడ్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించడం తో ఈ రెండు చిత్రాలకు లింకు పెట్టి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

సెప్టెంబర్ 28న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే చిత్రంపై రేకెత్తుతున్న రూమర్స్ చిత్ర యూనిట్ ని కాస్త కలవరపరుస్తున్నాయి. మరోపక్క ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం ఎన్ని భారీ అంచనాల మధ్య విడుదల అయిందో ఇప్పుడు అంతకంటే భారీ ఆరోపణల మధ్య చిక్కుకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కుష అవ్వాలి అంటే ఒక సాలిడ్ హిట్ పడాల్సిందే…అందుకే అందరూ నెక్స్ట్ విడుదల అయ్యే ప్రభాస్ చిత్రాలపై ఆశ పెట్టుకుని ఉన్నారు.