Salaar Teaser Release Date: ఆది పురుష్ హడావిడి ఇంకా తగ్గనేలేదు.. సినిమా థియేటర్లలో రిలీజ్ అయి ప్రస్తుతం కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు మూవీకి మిక్స్డ్ టాక్ కనిపిస్తోంది. ఒకపక్క సినిమా బ్రహ్మాండంగా ఉంది అని ఆకాశానికి ఎత్తే జనం ఉంటే మరో పక్క సినిమాలో లోపాలు వెతికేవారు ఉన్నారు. ప్రస్తుతానికి కలెక్షన్స్ పరంగా సినిమా బాగా సాగుతోంది అది హిట్ ఆఫర్ అనేది మరికొద్ది రోజుల్లో వచ్చే ప్రేక్షకాదరణ బట్టి తెలిసిపోతుంది.
Salaar Teaser Release Date: ప్రస్తుతం వీకెండ్ కావడంతో చిత్రం బాగానే నడుస్తోంది ఇంక సోమవారం నుంచి చిత్రం డిమాండ్ ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి మూవీ సక్సెస్ రేట్ అప్డేట్ అవుతుంది. అయితే ఈ మూవీ కారణంగా ప్రభాస్ చేస్తున్న సాలార్ మూవీ అప్డేట్ లేట్ అవుతోంది అని బయట రూమర్ ఉంది. అయితే ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయిపోవడంతో ప్రస్తుతం సాలార్ కు లైన్ క్లియర్ అయినట్లుగా ఉంది.
కే జి ఎఫ్ మూవీ లాంటి మాస్ యాక్షన్ మూవీ ఫేమ్ ప్రశాంత్ మరియు డార్లింగ్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సాలార్ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది అన్న విషయం పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో ప్రభాస్ మునుపెన్నడూ చూడడంట మాస్ యాంగిల్ తో పాటు పవర్ఫుల్ రోల్ మరియు బీభత్సకరమైన ఫైట్స్ అన్ని వేషాలతో రచ్చ పుట్టిస్తాడట.
సాలార్ చిత్రంలో ప్రభాస్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు అని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టీజర్ డేట్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న సాలార్ టీజర్ ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని.. ఆరోజు టీజర్ను విడుదల చేయాలి అనేది అసలు ప్లాన్ అట.

డార్లింగ్ ఫాన్స్ ఎప్పటినుంచో సాలార్ మూవీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా మొత్తం ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్నారు. బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందినప్పటికీ ఆ తరువాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ మూవీస్ కాస్త నిరాశపరిచాయి. ఆది పురుష్ విషయంలో ఇంకా ఎటు చెప్పలేని పరిస్థితి కాబట్టి ప్రస్తుతం ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని సాలార్ చిత్రంపై ఉన్నాయి.