Salaar USA Pre Booking Status: దేశ వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ సాలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. సాలార్ ట్రైలర్ ని సెప్టెంబర్ 7న విడుదల చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సాలార్ మూవీ విడుదల అవటానికి ఇంకా నెల రోజులు టైం ఉన్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన USA ఫ్రీ బుకింగ్ ఓపెన్ చేయడం జరిగింది.
Salaar USA Pre Booking Status: 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా నిరుత్సాహ పడుతున్నారు ఎందుకంటే సినిమా విడుదల అవటానికి ఇంకా నెల రోజులు టైం ఉండటంతో మూవీ టీం ఇంతవరకు సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలుపెట్టలేదు. ప్రభాస్ ఉన్న క్రేజ్ కి ప్రీ బుకింగ్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.
సాలార్ మూవీ విడుదల ముందే రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే USAలో అడ్వాన్స్ బుకింగ్ 2.5 కోట్లు ($300K) కలెక్ట్ చేసిన ఈ సినిమా మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం సాలార్ మూవీ ప్రీ బుకింగ్స్ 2.75కోట్లు ($334,108) దాటినట్టు తెలిసింది. 290 లొకేషన్స్ లో 848 షోలకు 11639 టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
అయితే సోషల్ మీడియాలో సాలార్ ట్రైలర్ మరికొన్ని రోజుల్లోనే విడుదల చేస్తారంటూ అలాగే 2 నిమిషాల 20 సెకండ్లు ఈ సినిమా ట్రైలర్ హై వోల్టేజ్ యాక్షన్స్ తో ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా యొక్క యాక్షన్ సన్నివేశాలు “KGF” కంటే ఎక్కువగా ఉన్నాయని…. క్లైమాక్స్‌లో ప్రభాస్ 1000 మందితో పోటీ పడతాడు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ కనపడతాడని టాక్ అయితే వినిపిస్తుంది.
ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు ప్రతినాయకులుగా కనిపించనున్నారు. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.