Prabhas shraddha kapoor Saaho Movie Songs, Release Date,Cast
Prabhas shraddha kapoor Saaho Movie Songs, Release Date,Cast

ప్రభాస్ హీరోగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సాహో.ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ సాహో అనిపించేస్తాయి అని అంతా ఎదురుచూస్తున్నారు.కానీ సినిమా టీమ్ మామూలుగా పాటలతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది.అయితే సాహో నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ కి బాలీవుడ్ లో ఒక మోస్తరు రెస్పాన్స్ వచ్చినా తెలుగులో మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాక్ దక్కించుకుంది.దీంతో ఈ సినిమా టీమ్ సెకండ్ సాంగ్ విషయంలో కాస్త జాగ్రత్త పడ్డారు.

ట్యూన్ మెలోడియస్ గా ఉంది.దానికి తగ్గట్టుగానే లిరిక్స్ కూడా తేలిక పదాలతో ఉండేలా తెలుగు రైటర్ తో అందరికి అర్ధమయ్యేలా రాయించారు.ఇక ఆ పాట తీసిన విధానం ఒక రేంజ్ లో ఉంది.స్విట్జర్ ల్యాండ్ లో మంచు కొండలు చాలా సార్లు చూసినా ఈ సారి ఇంకాస్త గ్రాండియర్ ఉండేలా ప్లాన్ చేసారు.బ్యాక్ గ్రౌండ్ కంటే కూడా ఫోర్ గ్రౌండ్ లో నవ్వుకుంటూ నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్,శ్రద్దా కపూర్ లు ఆ పాటకి నిండుతనం తీసుకువచ్చారు.ఆగష్టు 2 న విడుదల కాబోతున్న ఆ సాంగ్ గురించి డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు.