Prabhas, Shraddha Kapoor ,Saaho, Psycho Saiyaan Video Song
Prabhas, Shraddha Kapoor ,Saaho, Psycho Saiyaan Video Song

 

[INSERT_ELEMENTOR id=”3574″]

సాహో…ఈ సినిమా కోసం తెలుగు వాళ్ళు ఎంతగా వెయిట్ చేస్తున్నారు అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.మామూలుగానే ప్రభాస్ కి ఫ్యాన్స్ ఎక్కువ.పైగా బాహుబలి తరువాత వస్తున్న సినిమా కావడంతో ఆ మాత్రం బజ్ ఉండడం మామూలే.కానీ ఈ సినిమాకోసం హిందీ,తమిళ్,మలయాళంలో కూడా అదే రేంజ్ బజ్ ఉంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ని దాటి లాభాలు రాబట్టాలంటే ఇది సరిపోదు.అందుకే కొత్త స్ట్రాటజీ వాడుతున్నారు.ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నుండే ఈ సినిమా టీమ్ ప్లాన్ ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది.బాహుబలి సినిమాకి హిందీ లో ప్రమోషన్స్ గట్టిగానే చేసినా ఆ సినిమాలో ఎక్కడ హిందీ నేటివిటీ ఉండదు.అలాగే ప్రమోషన్స్ కూడా తెలుగు సినిమాలానే చేసారు.కానీ సాహో కి హిందీ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు.సయ్య సైకో అంటూ లిరికల్ బదులు ఫుల్ వీడియో సాంగ్ ఇచ్చేసారు.అయితే ఆ సాంగ్ వింటే ఎక్కడా కూడా తెలుగు సినిమా అన్న ఫీల్ లేదు.హిందీ వాళ్లకు నేటివ్ టచ్ లో ఉన్న ఆ సాంగ్ మనకు మాత్రం డబ్బింగ్ వెర్షన్ ఫీలింగ్ తెప్పిస్తుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]

సాహో ద్వారా హిందీలో 300 కోట్లు రాబట్టలనే టార్గెట్ పెట్టుకున్నారు.అందుకే దాన్ని రీచ్ అవ్వడానికి కంటెంట్ నుండి ప్రమోషన్స్ వరకు బాలీవుడ్ రూట్ లోనే వెళుతున్నారు.తెలుగులో ప్రభాస్ సుపరిచితమే.డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ.సో,సినిమాలో మినిమమ్ కంటెంట్ ఉన్నా వాళ్ళు హిట్ చేసేస్తారు.కానీ బాలీవుడ్ లో అలా కాదు.పైగా అదే రోజు మరో రెండు బాలీవుడ్ బడా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.వాటితో పోటీ పడి సాహో ని హిట్ గా నిలపడానికి,బాక్స్ దగ్గర సాహో స్టార్మ్ ఉండేలా చూడడానికి ఈ ప్లానింగ్ తో వెళుతున్నారు.కానీ మిగతా అన్ని బాషలకంటే తమిళ్ లో సాహో కి ఎక్కువ క్రేజ్ ఉండడం విశేషం.

[INSERT_ELEMENTOR id=”3574″]