Prabhas: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ కన్ఫార్మ్

0
308
Prabhas Starrer Adipurush Movie Release Date Announced

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో చేయనున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’పై యూనిట్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్‌ను మాత్రమే సెలక్ట్ చేయగా.. మిగిలిన తారాగణాన్ని ఎంపి చేసే పనిలో ఉంది యూనిట్. అసలు షూటింగే ప్రారంభం కాలేదు.. అప్పుడే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌తో పాటు షాకిచ్చింది.

సరిగ్గా గురువారం ఉదయం దర్శకుడు ఓం రౌత్ తన ట్విట్టర్‌లో షాకింగ్ ప్రకటన చేశారు. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఆగస్టు 11, 2022లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారంటే పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అర్థం అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న స్ట్రెయిట్ హిందీ మూవీ కావడంతో అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ పూర్తైన వెంటనే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భూషణ్‌ కుమార్‌, రాజేష్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

Previous article‘ఆకాశం నీ హద్దురా’పై మహేశ్‌బాబు ప్రశంసలు
Next articlePrabhas-Saif Ali Khan Starrer ‘Adipurush’s’ Release Date Confirmed