shraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal
shraddha kapoorshraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal

బాహుబలి ముందు వరకు తెలుగువాళ్ళకు మాత్రమే డార్లింగ్ అయిన ప్రభాస్…బాహుబలి తరువాత మాత్రం యూనివర్సల్ హీరో గా ఎదిగాడు.బాలీవుడ్ సర్కిల్స్ లో అయితే అక్కడి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.అందుకే ఆ మార్కెట్ ని హోల్డ్ చెయ్యడానికి 200 + క్రోర్స్ బడ్జెట్ ఉన్న సినిమాలకే ఓకే చెబుతున్నాడు.

ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ సాహో కి అయితే ఏకంగా 250 నుండి 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు.అందుకు తగ్గట్టే ఆ సినిమా కూడా తెరకెక్కుతుంది అని ఇప్పటికే బయటికి వచ్చిన విజువల్స్ ప్రూవ్ చేసాయి.అయితే ప్రభాస్ ఇప్పుడు ఆ సినిమా గురించి ఒక స్పెషల్ అప్డేట్ అందించబోతున్నాడు.ఆ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఒక వీడియో బైట్ తో కన్ఫర్మ్ చేసాడు.ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రెండు మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేసారు.వాటికి స్టన్నింగ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ స్పెషల్ అప్డేట్ అంటే మరొక మేకింగ్ వీడియో ఇవ్వబోతున్నారా? అనే డౌట్ చాలామందికి ఉంది.కానీ దాన్ని ఇలా చిన్నగా అనౌన్స్ చేసి రిలీజ్ చెయ్యరు.ఎందుకంటే వాటికి వచ్చే స్పందనని బట్టే సినిమా బిజినెస్ జరుగుతుంది.మరి ఈ సర్ప్రైజ్ ఏంటి?.సాహో సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు 15 అని ఎప్పుడో అనౌన్స్ చేశారు.అయితే ఆ డేట్ దగ్గరికి వస్తుంది.దాన్ని కన్ఫర్మ్ చేసుకుని మిగతా సినిమాలు రిలీజ్ డేట్ వేసుకువాలి.అందుకే సాహో కి సంబంధించి ఇచ్చే అప్డేట్ ఖచ్చితంగా రిలీజ్ డేట్ అయ్యి ఉంటుంది అని టాక్.ఈ మధ్య సాహో కి సంబంధించి ప్రభాస్ స్పెషల్ ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నాడు.

సో,సాహో కి సంబందించిన సరికొత్త స్టిల్ తో ఆ అప్డేట్ బయటికి రాబోతుంది.అయితే ప్రభాస్ ఇచ్చిన ఒక చిన్న బైట్ కే ఇన్స్టాగ్రామ్ మోత మోగిపోతుంది.బాలీవుడ్ సర్కిల్స్ సాహో గురించి ఆసక్తిగా ఎదురుచూడడం మాత్రం ఆ సినిమా టీమ్ కి,ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది.