బ్రేకింగ్ న్యూస్: ప్రభాస్-రాజమౌళి మూడోస్సారి..

Prabhas and Rajamouli are set to work together again soon
Prabhas and Rajamouli are set to work together again soon

(Prabhas teaming up with SS Rajamouli again after Baahubali film series)దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 85 శాతంకు పైగా పూర్తయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. మన్యం వీరుడు అల్లూరిగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్.

బాహుబలి తర్వాత ప్రభాస్ తో రాజమౌళి మరో సినిమా చేస్తాడని ఎప్పటినుంచో వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ సినిమా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతమే అనుకున్నారు అందరూ. కానీ రాజమౌళి మహాభారతం ఇంట్రస్ట్ అనే అన్నాడు కానీ ఆ సినిమాపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. కానీ అతి త్వరలోనే రాజమౌళి – ప్రభాస్ కలిసి ఓ ప్రొడక్షన్ వెంచర్ ను ప్రారంభించబోతున్నట్టు ఫిలిం నగర్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ప్రొడక్షన్ వెంచర్ ద్వారా వీరిద్దరి కాంబోలోనే ఓ సినిమా తీయనున్నారట. ఈ సినిమాను మల్టీస్టారర్ గా కాకుండా ప్రభాస్ ను సోలో హీరోగానే పాన్ ఇండియా సబ్జెక్ట్ గానే తెరకెక్కించాలని జక్కన్న ఆలోచనగా చెప్తున్నారు.

ప్రస్తుతానికి ఈ సెన్షేషనల్ వార్తపై ఇంకా అఫిషియల్ క్లారిటీ లేకపోయినా ఈ వార్త మాత్రం సెన్షేషనల్ గా వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.