Prabhas Thanks To Movie Industry For Supporting Solo Release Of Saaho
Prabhas Thanks To Movie Industry For Supporting Solo Release Of Saaho

ఆగస్టు 15 కి రిలీజ్ కావాల్సిన సాహో అనుకోకుండా వాయిదా పడింది.కానీ ఈ సినిమా ఆగస్టు 30 కి అయినా వస్తుందా అనే కామెంట్స్ సోషల్ మీడియా లో అక్కడక్కడా కనిపించాయి.కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ ఆగష్టు 30 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అయ్యింది సాహో.ఈ సినిమా రిలీజ్ అవుతున్న కారణంగా తెలుగు,తమిళ,మలయాళ,హిందీ భాషల్లో కొన్ని చిన్నా పెద్దా సినిమాల షెడ్యూల్స్ మార్చుకున్నారు.కొన్ని సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకుంటే,మరి కొన్ని సినిమాలు మాత్రం ప్రీ పోన్ అయ్యాయి.

అందుకే ఆయా సినిమాల నిర్మాతలను,హీరోలను అభినందిస్తూ,సాహో కి దారిచ్చినందుకు థాంక్స్ చెంబుతూ ఆ సినిమా టీమ్ ఒక లెటర్ ని రిలీజ్ చేసింది.సాహో సోలో రిలీజ్ కి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు అనే ఆ లెటర్ కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయితే ఈ లెటర్ ద్వారా సాహో మళ్ళీ వాయిదా పడే అవకాశమే లేదు అని తేల్చిచెప్పడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ సాహో రిలీజ్ ని సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

బాహుబలి వల్ల బాలీవుడ్ లో స్వతహాగా ప్రభాస్ కి మార్కెట్ ఉంది.పైగా ఈ సినిమాలో శ్రద్దా కపూర్,నీల్ నితిన్ ముఖేష్,జాకీ ష్రాఫ్,మందిరా బేడీ లాంటి బాలీవుడ్ పెర్సనాలిటీస్ నటించడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగింది.ఫస్ట్ డే ఈ సినిమా కలెక్షన్స్ 100 కోట్లు దాటుతాయని ట్రేడ్ అంచనా వేస్తున్నారు.అంత భారీ హైప్ తో రిలీజ్ అవుతున్నసాహో కి హిట్ టాక్ వస్తే వెయ్యికోట్ల వసూళ్లు పెద్ద అసాధ్యం కాదు.