Prabhas to training new skills for Adipurush

బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన ప్రభాస్, ఇటీవల మరో క్రేజీ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓమ్‌ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే చిత్రంలో ప్రభాస్ నటించనున్నారు. రామాయణం కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్, రాముడిగా కనిపించనున్నారు. ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యాం అంటూ ఓ రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. తర్వాత నాగ్ అశ్విన్ తో మరో సోసియో ఫాంటసీ మూవీకి రెడీ అవుతున్నాడు.

ప్రభాస్ బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆది పురుష్ కోసం కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలు విద్య నేర్చుకోడానికి తనని తాను ట్రాన్సఫర్మెట్ చేసుకోనున్నాడని తెలుస్తుంది. అలాగే మంచి బాడీ ఫిట్నెస్ కోసం అప్పుడే ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ కూడా చేస్తున్నాడట. ఇక ఎలాంటి గ్యాప్ రానివ్వకుండా ప్రభాస్ సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ ఫాన్స్ ని ఖుష్ చేస్తున్నాడు.

ఇక 3డీలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో గ్రాఫిక్స్‌ భారీ రేంజ్‌లో ఉండనున్నాయి. ఈ క్రమంలో గ్రాఫిక్స్ కోసమే నిర్మాతలు 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ గ్రాఫిక్స్ కోసం గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీమ్‌తో సంప్రదింపులు జరపాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. హెచ్‌బీఓ టీవీ సిరీస్‌ గేమ్ ఆఫ్‌ థ్రోన్స్‌లోని గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఆ టీమ్‌ని ఆదిపురుష్‌ కోసం తీసుకోవాలనుకుంటున్నట్లు టాక్‌.