నా మీద ప్రభాస్‌కు క్రష్: సీనియర్ నటి భాగ్యశ్రీ

0
332
prabhas told me he crushed on me says radhe shyam actress bhagyashree

Prabhas Bhagyashree: బాహుబలి.. సాహోలతో ప్రభాస్ రేంజ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్.. హాలీవుడ్ రేంజ్ కు పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ పలు ప్రతిష్టాత్మకమైన మూవీల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’లో ఆయనకు తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ప్రభాస్ క్రష్ గురించి సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది.

తాను ‘రాధే శ్యామ్’లో నటిస్తుండటం పట్ల భాగ్యశ్రీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భాగ్యశ్రీ.. ప్రభాస్‌కు తన మీద క్రష్ అని బాంబ్ పేల్చారు. ఈ విషయాన్ని ప్రభాస్ తనకు స్వయంగా చెప్పారని అన్నారు. ‘‘ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌తో పాటు ప్రతి ఒక్కరూ ‘మైనే ప్యార్ కియా’ చూశారు. నా మీద క్రష్ ఉండేదని ప్రభాస్ నాకు స్వయంగా చెప్పారు’’ అని భాగ్యశ్రీ వెల్లడించారు.

ఇక రాధేశ్యామ్ ఎంతో అద్భుతమైన ప్రేమ కథ అని.. దీనిని ఆస్వాదించాలంటే సినిమాను చూడాల్సిందేనని భాగ్యశ్రీ తెలిపింది. రాధేశ్యామ్’ యూనిట్ తనను ఎంతో బాగో చూసుకుంటున్నారని.. హైదరాబాద్ స్వీట్లను కూడా బహుమతి ఇచ్చినట్లు చెప్పింది. గతంలోనూ ఈ వెటరన్ భామ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెల్సిందే. ప్రభాస్‌కు తల్లిగా నటిస్తుండటం మీకు ఎలా అనిపిస్తుంది? అని అడిగిన ప్రశ్నకు భాగ్యశ్రీ స్పందిస్తూ.. ‘‘ఆ పాత్రకు మీరు సరిపోతారని ఎలా అనుకున్నారు అని ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతారని నాకు తెలుసు. సినిమాలో నేను చేస్తున్న పాత్ర కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని డైరెక్టర్ నాకు చెప్పారు’’ అని అన్నారు.

ఏదిఏమైనా సీనియర్ నటితో ప్రభాస్ క్రష్ ను అతడే స్వయంగా భాగ్యశ్రీకి చెప్పడంపై డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.రెబల్ స్టార్ డాక్టర్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు.