Prabhas Upcoming movies list: నేషనల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ ఒప్పుకొని షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమాలు లిస్టు చూస్తే ప్రాజెక్ట్ కే, సలార్, ఆదిపురుష్, మారుతి, సిద్దార్ధ్ ఆనంద్ అలాగే సందీప్ వంగ స్పిరిట్ సినిమాలు ప్రస్తుతానికి లైన్ లో ఉన్నాయి.. ఈ సినిమాలపై సోషల్ మీడియా లో చాలా రూమర్స్ నడుస్తున్నాయి.
Prabhas Upcoming movies list: బాహుబలి సిరీస్ లాగా ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలు సలార్ పార్ట్ 1..పార్ట్ 2 అలాగే ప్రాజెక్ట్ కే పార్ట్ 1..పార్ట్ 2 అనే రూమర్స్ నడుస్తున్నాయి. వీటిలో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉన్నది. ఇలా చూస్తే 2026 దాకా ప్రభాస్ సినిమాలకి అలాగే షూటింగ్ కి గ్యాప్ లేకుండా ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రభాస్ కెరియర్ లోనే అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ కే. ఈ సినిమా కూడా ఇప్పుడు రెండు భాగాలుగా వస్తుంది అంటున్నారు. మొదటి భాగమే ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ కానప్పుడు.. రెండో భాగానికి ఇంకెంత సమయం పడుతుంది.. మరి ఈ మధ్యలో విడుదలయ్యే సినిమాల పరిస్థితి ఏమిటి.. బాహుబలికి మాత్రమే సాధ్యమైన స్క్రిప్టు ఇప్పుడు ప్రభాస్ రాబోయే సినిమాలకి వర్కౌట్ అవుతుందా అని సినీ సర్కిల్లో చాలామంది విశ్లేషిస్తున్నారు..
ఇలా అన్ని సినిమాలు సీక్వెల్ చేసుకుంటా వెళ్తే తర్వాత వచ్చే సినిమాల పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఆలోచించాల్సి వస్తుంది. సాహు..రాధేశ్యామ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత రీతిలో ఆడలేదు.. అయినప్పటికీ ప్రభాస్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కి వచ్చే సినిమాలు కి డోకా లేదు.
సమాచారం మేరకు, ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సినిమాలకు రెండు వారాలు ప్రతి సినిమాకి డేట్స్ ఇవ్వటం జరుగుతుందంట.. మరి ఇలా చేసుకుంటూ వెళ్తే లుక్కు పరంగా అలాగే మిగతా విషయాల్లోనూ చాలా మార్పులు వస్తాయి.. మరి వాయిదాల పద్దతిలో పూర్తి చేయాలని అనుకోవడం సరైనదేనా అన్నది ప్రభాస్ నే ఆలోచించాలి.