Prabhas Lord Shiva Role In Manchu Vishnu Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ మరో హీరో సినిమాలో అతిధి పాత్రలో నటించేందుకు అంగీకరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మంచు విష్ణు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ చిత్రంలో హీరో ప్రభాస్ అతిధి పాత్రలు పోషిస్తారని పుకార్లు వ్యాపించాయి. వివరాల్లోకి వెళ్దాం.
Prabhas Lord Shiva Role In Manchu Vishnu Movie: మంచు విష్ణు తన రాబోయే చిత్రం “కన్నప్ప”తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. శ్రీకాళహస్తి ఆలయంలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడు.
మహా భారతం సిరీస్‌లో తన పనితనానికి ప్రసిద్ధి చెందిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన “కన్నప్ప” ఒక ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభూతిని అందజేస్తుందని హామీ ఇస్తున్నారు మంచు విష్ణు. అయితే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక కీలకమైన పాత్ర చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్.
ప్రభాస్ ఈ సినిమాలో శివుడు వేషంలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది అలాగే సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు కూడా ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడని విష్ణు ట్వీట్ ద్వారా ధృవీకరించారు. బాలీవుడ్ స్టార్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ఈ సినిమాలో భాగం కానుంది.
ప్రభాస్ ఈ సినిమాలో దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు కనిపించపోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి గాను పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచయితలు అలాగే మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీత అందిస్తున్నారు ఈ సినిమాకి. అవా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.